News March 26, 2025
అంబాజీపేట: బంగారు మురుగు సినిమా షూటింగ్

బంగారు మురుగు చిత్రం షూటింగ్ అంబాజీపేటలో మంగళవారం జరిగింది. డొక్కా ఫణి దర్శకత్వంలో పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్ నిర్వహిస్తున్నారు. నాయనమ్మ- మనవడు మధ్య జరిగే ఉమ్మడి కుటుంబం, పిల్లల పెంపకం, బంధుత్వాలు ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉంటాయని దర్శకులు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు షూటింగ్ జరుగుతుందన్నారు. మాచవరం కోటి వారి అగ్రహారంలో మేడిది సత్తిరాజు వ్యవసాయ క్షేత్రంలో పలు దృశ్యాలను చిత్రీకరించారు.
Similar News
News February 23, 2026
ప్రజావాణిలో అర్జీలకు ప్రాధాన్యత: కలెక్టర్

పెద్దపల్లిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భూమి పట్టా, అక్రమ నిర్మాణాల తొలగింపు, పట్టా పుస్తక జారీ వంటి సమస్యలపై సంబంధిత తహసిల్దార్లు, మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
మంచిర్యాల: ‘రేషన్ పంపిణీలో నిబంధనలు పాటించాలి’

నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 23, 2026
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి నాలుగేళ్లు

ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి రేపటితో నాలుగేళ్లు పూర్తికానున్నాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడులకు ఆదేశించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 14,999 మంది పౌరులు మరణించినట్లు UN తెలిపింది. 59లక్షల మంది పౌరులు విదేశాలకు వలస వెళ్లిపోయారు. 1.40లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు, 3.25లక్షల మంది రష్యా జవాన్లు చనిపోయినట్లు సమాచారం.


