News April 4, 2025
అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అంబాజీపేట మండలం గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
పాలకోడేరు: పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన కలెక్టర్

పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహ సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను శ్రద్ధగా చూడాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.
News December 4, 2025
జగిత్యాల: ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవమైన గ్రామాలలో ఉపసర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేల చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులున్నారు.
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ టికెట్‌ను కొనుగోలు చేసిన చిత్తూరు MLA

విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టును చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి సినిమా టికెట్టును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. బాలకృష్ణ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


