News February 12, 2025

అంబారిపేటలో బైక్ దొంగతనం.. కేసు నమోదు

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో శనిగారపు అశోక్ అనే వ్యక్తికి చెందిన బైకును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. తాను బైకును తన పంట పొలం వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడని, కొద్దిసేపటికి బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పారు. అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నవీన్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

తమ్ముడి కులాంతర వివాహం.. అన్న దారుణ హత్య!

image

TG: తమ్ముడి కులాంతర వివాహం అన్న చావుకొచ్చిన ఘటన MBNR(D)లో జరిగింది. రంగారెడ్డి(D) ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవానీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో యువతి తండ్రి వెంకటేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ సహకారంతోనే ఇదంతా జరిగిందని వెంకటేశ్ మరో ఐదుగురితో కలిసి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు.

News November 17, 2025

అలా చేస్తేనే తిరుపతి యాత్ర పూర్తవుతుందట..!

image

పరమపావనమైన పురుషోత్తముడి దర్శనానికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. పూర్వం సౌకర్యాలు లేకపోవడంతో తిరుచానూరులోనే వేంకన్న దర్శనం జరిగేది. తిరుమలకు సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తులు అక్కడ స్వామివారిని.. తిరుచానూరులో పట్టపురాణి దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతి యాత్ర సంపూర్ణం కావాలంటే ఇద్దరిని దర్శించుకోవాలని పలువురు చెబుతున్నారు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరుకు వస్తుంటారు.

News November 17, 2025

మెదక్: పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.1, సదాశివపేట 7.9, న్యాల్కల్ 8.0, మెదక్ జిల్లా నర్లాపూర్, సర్ధాన, వాడి 9.3, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డి పేట 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.