News March 21, 2024
‘అంబికా లక్ష్మీనారాయణకే హిందూపురం టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వాలి’
హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, నాగరాజు, ఆదినారాయణ శ్రీరాములు, ఆనంద్ పాల్గొన్నారు.
Similar News
News September 17, 2024
అనంతలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం
అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్‌కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.
News September 17, 2024
బద్రీనాథ్‌లో చిక్కుకున్న 40 మంది తాడిపత్రి వాసులు
తాడిపత్రికి చెందిన 40 మంది యాత్రికులు బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ రహదారిని మూసివేశారు. దీంతో నిన్నటి నుంచి రోడ్డుపైనే ఉంటున్న యాత్రికులు ఆహారం, నీళ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని వారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు.
News September 17, 2024
తెగిపడిన గుంతకల్లు యువకుడి చెయ్యి
కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుశ్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. రైలులో పుత్తూరుకు వెళ్తూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.