News April 14, 2025

అంబేడ్కర్‌కి నివాళి అర్పించిన కలెక్టర్

image

ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.

Similar News

News April 19, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఒంగోలు గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ శిక్షణ మే నెల 21 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం అని తెలిపారు. 

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

News April 19, 2025

సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

image

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!