News December 6, 2024
అంబేడ్కర్‌కు నివాళులు అర్పించకుండా నిర్బంధాలా..?: హరీశ్ రావు

రాష్ట్రంలో అప్పటికీ ఎమర్జెన్సీ కొనసాగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు X వేదికగా మండిపడ్డారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న BRS నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదా అని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న పార్టీ శ్రేణులను విడుదల చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
మెదక్: రేపు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కలెక్టర్

మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈనెల 12న నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత అధికారులు రెండు రోజులపాటు విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
మెదక్: ‘మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతం’

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలో, పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.
News February 11, 2026
నర్సాపూర్: ఓటు కేవలం హక్కు కాదు.. బాధ్యత!

పురపాలక ఎన్నికల సందర్భంగా నర్సాపూర్‌కు చెందిన నవీన్-దివ్య దంపతులు తమ పసిపిల్లలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులు సైతం వచ్చి ఓటు వేయడం ఆదర్శనీయమని, సమయం ఉండి ఓటు వేయని వారు వీరిని చూసి మారాలని పలువురు అంటున్నారు.


