News April 14, 2025

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: ఆసిఫాబాద్ ఎస్పీ

image

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కోసం, ప్రజలు హక్కుల కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.

Similar News

News February 7, 2026

ఇంటర్ పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News February 7, 2026

విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

image

విశాఖ ఐటీ హిల్స్‌కు వెళ్లే ఉద్యోగుల కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో అదనంగా రెండు ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. అలాగే జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం అమలులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు.

News February 7, 2026

సంగారెడ్డి: ఈనెల 9న ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల విధుల నేపథ్యంలో ఈ నెల 9న నిర్వహించాల్సిన జిల్లాస్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.