News March 14, 2025
అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.
Similar News
News March 24, 2025
కోనసీమ: నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికో?

మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందన్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఎవరికి పదవులు దక్కేనన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. కొత్తపేట నుంచి బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు నియోజకవర్గం నుంచి జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, అమలాపురం నుంచి మెట్ల రమణబాబు, ముమ్మిడివరం నుంచి గుత్తుల సాయి, పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాథ్‌బాబు, కొత్తపేట జనసేన నేత బండారు శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.
News March 24, 2025
రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.
News March 24, 2025
మళ్లీ సొంతగూటికేనా!

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.