News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం: మంత్రి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాల, ఆలోచనల సాధనకు ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్‌లో అంబేడ్కర్ జయంతి నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాలే ఇందుకు మేలిమి ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

AP: రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1,537 కేంద్రాల్లో 10,57,899 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని బోర్డు తెలిపింది. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. సమాధానాలు రాసేందుకు బుక్‌లెట్ మాత్రమే ఇస్తారు. ఈసారి అడిషనల్ ఆన్సర్ షీట్లు ఇవ్వరు.
News February 23, 2026
పరీక్షల తర్వాతే ఎన్నికలు?

TG: MPTC, ZPTC ఎన్నికలు ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగమంతా ఆయా పనుల్లోనే బిజీగా ఉండనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
News February 23, 2026
ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.


