News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం: మంత్రి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాల, ఆలోచనల సాధనకు ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్‌లో అంబేడ్కర్ జయంతి నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాలే ఇందుకు మేలిమి ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: రేపే చివరి అవకాశం

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.
News July 11, 2025
అరుణాచలంలో మోత్కూర్ వ్యక్తి దారుణ హత్య

మోత్కూర్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ అరుణాచలంలో దారుణ హత్యకు గురయ్యారు. గురువారం దుండగులు ఈజీ మనీ కోసం అతని మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపు విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఇందిరానగర్ కాలనీలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ దుర్మార్గానికి తలపడ్డవారిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
News July 11, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.