News April 18, 2025

అంబేడ్కర్ కోనసీమ: ఇక కరెంటు కట్ ఉండదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఇక కరెంటు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు శుక్రవారం తెలిపారు. 132 కేవీ లైన్‌లో ఛార్జ్ అయ్యాయన్నారు. సాధారణ స్థితి పునరుద్ధరించబడిందని చెప్పారు. ఉదయం 7.10 గంటలకు సరఫరా పునరుద్ధరించటం జరిగిందన్నారు. రెండు రోజుల నుంచి పడిన కరెంటు కష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఇక వినియోగదారులు నిశ్చింతగా ఉండాలని సూచించారు.

Similar News

News April 20, 2025

పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

image

ఉట్నూర్ మండలం దేవుగూడ ప్రభుత్వ గిరిజన టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క శిశు బెంచెస్ అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పాల్గొన్నారు.

News April 20, 2025

గోవిందరావుపేట: భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

image

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు. అధికారులు గ్రామాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తారని తెలిపారు.

News April 20, 2025

బాపట్ల: రేపు చీరాలలో ప్రజా వేదిక- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

error: Content is protected !!