News February 21, 2025
అంబేడ్కర్ కోనసీమ జిల్లా TODAY TOP NEWS

☞ త్రేయపురం: చికిత్స పొందుతూ తల్లీ కొడుకు మృతి, ☞ముమ్మిడివరం: అత్యాచారం, కిడ్నాప్ కేసు నిందితుడు అరెస్ట్, ☞రాజోలు: గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం, ☞AMP: చీరకు నిప్పంటుకొని మహిళ మృతి,☞ అక్రమ ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలి: కలెక్టర్, ☞ఆలమూరు: సీజ్ చేసిన వాహనాలు బహిరంగ వేలం, ☞తూ.గో జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు, ☞AMP: బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్‌కు పితృవియోగం
Similar News
News February 22, 2025
బంతులా?.. బుల్లెట్లా?

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.
News February 22, 2025
MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్మెంట్తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.
News February 22, 2025
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు.