News April 9, 2025
అంబేడ్కర్ కోనసీమ: తల్లిని చూసేందుకు వెళ్తూ మృత్యు ఒడిలోకి

తల్లిని చూసేందుకు బైక్పై వెళ్తూండగా టిప్పర్ ఢీ కొట్టడంతో తాళ్లపూడి M గజ్జరానికి చెందిన కడలి గోవింద్ (44) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆత్రేయపురం M మెర్లపాలెంలో మంగళవారం జరిగింది. బైక్పై వెళ్తున్న గోవిందును టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టిందని ఎస్సై రాము తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యవసాయం చేసుకునే గోవిందు తల్లిని చూడ్డానికి వెళ్తూ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
సిరిసిల్ల: నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీ యువతి యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 26, 2025
అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు


