News April 11, 2025

అంబేడ్కర్ కోనసీమ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి.

Similar News

News January 7, 2026

HYD: 1000 డాలర్ల కోసం నిఖిత హత్య?

image

అమెరికాలో HYD యువతి నిఖిత హత్యకు డబ్బుల విషయమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. US పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు నిఖిత 4500 డాలర్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అందులో 3500 డాలర్లు ఇవ్వగా మిగతా డబ్బులు ఇవ్వాలని నిఖిత అడిగింది. ఈ క్రమంలో గొడవ పెద్దదై అర్జున్ నిఖితను హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా <<18770024>>డబ్బుల విషయమే<<>> హత్యకు కారణం అయ్యిందని మీడియా ద్వారానే తెలిసిందన్నారు.

News January 7, 2026

మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

image

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్‌ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.