News February 15, 2025
అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా చక్రవర్తి

భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి రజియా సుల్తానా. క్రీ.శ 1236- 1240 వరకు నాలుగేళ్ల పాటు ఢిల్లీ గద్దెపై కూర్చొని సుమారు సగం భారతదేశాన్ని పరిపాలించారు. సెల్జుక్ వంశానికి చెందిన రజియా అటు టర్కిష్ చరిత్రలోనూ ఇటు ముస్లిం చరిత్రలోనూ ప్రథమ మహిళా చక్రవర్తిగా పేరుగాంచారు. అప్పటి పురుషాధిక్య సమాజంలో అవరోధాలన్నీ ఎదుర్కొన్న ఆ ధీరోదాత్తను మాత్రం చరిత్ర మర్చిపోయింది.
News December 13, 2025
NGKL: జిల్లాలో పెరిగిన చలి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత వారం రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా బల్మూర్ మండలంలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, కల్వకుర్తి మండలలో 9.8, తెలకపల్లి మండలంలో 10.1, పదర మండలంలో 10.4, లింగాల మండలంలో 10.7, తాడూర్ 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో బల్మూరు, అమ్రాబాద్, కల్వకుర్తి మండలాల్లో ఆరంజ్ అలెర్ట్ జారీ చేయడం జరిగింది.
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.


