News February 15, 2025
అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 22, 2025
BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్‌లా తయారవ్వాలి. మోదీ నా మెడపై కత్తిపెట్టినా నేను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.
News March 22, 2025
కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.