News February 16, 2025
అంబేడ్కర్ కోనసీమ: 18న పరస్పర అవగాహన సదస్సు

విదేశాలలో వివిధ రకాల ఉద్యోగాలు, ఉపాధిని పొంది కుటుంబాలను పోషించాలనుకునేవారు, విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికి మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్లతో ఈనెల 18న పరస్పర అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 15, 2025
భద్రాద్రి: లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. నేటి స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కాదగిన కేసులను కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు.
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి నెటిజన్ల సపోర్ట్.. ఎందుకిలా?

పోలీసులు అరెస్టు చేసిన iBOMMA నిర్వాహకుడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు. OTT సబ్‌స్క్రిప్షన్ ధరలూ భారీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అతడు చట్టవిరుద్ధమైన పైరసీతో ఇండస్ట్రీకి భారీగా నష్టం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT?
News November 15, 2025
ఢిల్లీకి నవీన్ యాదవ్.. మతలబ్ ఏంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్‌కు ఢిల్లీలో ప్రశంసలు వచ్చాయి. CM రేవంత్, dy.CM భట్టి, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. జూబ్లీలోని బస్తీ వాసులు గెలిపించిన నాయకుడు ఢిల్లీకి వెళ్లడం తాజా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పట్టులేని చోట కాంగ్రెస్‌ను నిలబెట్టిన యూసుఫ్‌గూడ బస్తీ వాసికి అదనపు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.


