News August 15, 2024
అంబేడ్కర్ గురించి మాట్లాడే అర్హత YS జగన్‌కి లేదు: గొట్టిపాటి
వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని అన్నారు. పేరుకు అంబేడ్కర్ విగ్రహం పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాయించుకుని తన ప్రచార పిచ్చిని చాటుకున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా ఉండటంతో అభిమానులు తొలగించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Similar News
News September 8, 2024
ప్రకాశం SP పేరిట చాటింగ్.. సైబర్ నేరగాళ్ల వల
ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా జిల్లా SP దామోదర్‌ను టార్గెట్ చేశారు. ఎస్పీ పేరుతో వాట్సప్ DP పెట్టి కొత్త నెంబర్‌తో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ సీఐ వి సూర్యనారాయణకు రూ.50వేలు అర్జెంటుగా కావాలంటూ వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో సామాన్యులు అలర్డ్‌గా ఉండాలన్నారు.
News September 7, 2024
పెద్దారవీడు వద్ద రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న SP
పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద వినాయక విగ్రహంతో వెళ్తున్న దేసిరెడ్డిపల్లి <<14041015>>ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది.<<>> ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఆ గ్రామంలో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న SP చలించిపోయారు. దీంతో గ్రామస్థుల్లో బాధను పోగొట్టడానికి ఎస్పీ దామోదర్ స్వయంగా వారితో మాట్లాడి, మరో విగ్రహాన్ని పంపించారు. దీంతో గ్రామంలో తిరిగి ఆనందం నింపారని పలువురు SPని అభినందిస్తున్నారు.
News September 7, 2024
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ
వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.