News April 14, 2025

అంబేడ్కర్ చిరస్మరణీయులు: సోమిరెడ్డి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయులని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సెంటరులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలసి పాల్గొన్నారు. మొదట వసతి గృహ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు సౌకర్యాలపై ఆరా తీశారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

Similar News

News April 18, 2025

నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

image

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.

News April 18, 2025

ICDS నెల్లూరు PDగా సువర్ణ బాధ్యతల స్వీకరణ

image

నెల్లూరు జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సువర్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా విధులు నిర్వహిస్తున్న సుశీల అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జ్ పీడీగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొనసాగుతున్నారు. దీంతో సువర్ణను రెగ్యులర్ పీడీగా నియమించారు.

News April 18, 2025

నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

image

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.

error: Content is protected !!