News April 14, 2025
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలి: కలెక్టర్

నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఈనె14న 134వ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి సమావేశ మందిరంలో జరుగుతాయన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News April 18, 2025
వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.
News April 18, 2025
సిరిసిల్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.లక్ష పంపిణీ

సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష నిధులు విడుదల చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందన్నారు. ప్రాజెక్టు కింద పైలెట్ ప్రాజెక్టుకింద మొత్తం1023 ఇళ్లు మంజూరు చేశామన్నారు.
News April 18, 2025
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.