News July 17, 2024
అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News October 18, 2025
GNT: వారి భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోలీసులు గంజాయి పట్టుకుంటున్నారు. ఇటీవల యువతలో మాదకద్రవ్యాల వాడకం పెరగటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాల వాడకానికి దారితీసే అనుమానాస్పద ప్రవర్తన, స్నేహ వర్గం, ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. @ యువ భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!
News October 18, 2025
లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్లు కలిగిన నర్సింగ్ హోమ్లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News October 18, 2025
గుంటూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు

గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం శనివారం దాడులు నిర్వహించింది. పాత గుంటూరు PS పరిధిలో పేకాట ఆడుతున్న 10మందిని అదుపులోకి తీసుకుని, 10 సెల్ ఫోన్లు, ₹25,500 నగదు, 4 బైకులను సీజ్ చేశారు. అలాగే, అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్మూలించడమే టాస్క్ ఫోర్స్ లక్ష్యమని ఎస్పీ అన్నారు.