News April 14, 2025

అంబేడ్కర్ సేవలను కొనియాడిన తిరుపతి SP 

image

తిరుపతి ఎస్పీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడికి న్యాయం చేసేలా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఎస్పీ కొనియాడారు. అలాగే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు. 

Similar News

News October 28, 2025

ఎలాంటి నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు: కందుల

image

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. రాజమండ్రిలోని కలెక్టర్ ఆఫీసులో తుఫాను సహాయక చర్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

News October 28, 2025

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: భద్రాద్రి కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో వారు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

News October 28, 2025

సదరం క్యాంపును పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్

image

కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పరిశీలించారు. క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్‌లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును సమీక్షించారు.