News April 12, 2025
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.
Similar News
News April 15, 2025
యూరిన్ ఆపుకుంటున్నారా?

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.
News April 15, 2025
వరంగల్: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
News April 15, 2025
రోడ్డు ప్రమాదంలో కొత్తకోట యువకుడి మృతి

ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు అచ్చి బాబు, రమణమ్మ శోక సంద్రంలో మునిగిపోయారు. కొత్తకోట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కాకినాడ జిల్లా మూలపేట వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. అచేతనంగా పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు నింగినంటాయి.