News April 12, 2025

అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.

Similar News

News February 17, 2026

మైక్రో ఇరిగేషన్ పథకంపై మరింత అవగాహన అవసరం: కలెక్టర్

image

ఏలూరు జిలాల్లో మైక్రో ఇరిగేషన్ పథకంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడుతూ.. డ్రిప్, స్ప్రింక్లర్లు 8,500 హెక్టార్లలో ఏర్పాటు చేయాలని నిర్దేశించగా ఇప్పటి వరకు 6,268 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు కావడంపై అధికారులపై మండిపడ్డారు. అటు రైతులంతా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 17, 2026

VZM: విశాఖలో సాగర సంగ్రామానికి APNGO మద్దతు

image

ఈనెల 22న ఆదివారం విశాఖపట్నంలో జరగనున్న “సాగర సంగ్రామం” కార్యక్రమానికి APNGO’ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయనగరం ఎన్‌జీవో హోమ్ భవనంలో జిల్లా అధ్యక్షుడు సురేశ్, కార్యదర్శి శ్రీధర్ చేతుల మీదుగా మంగళవారం కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంక్రాంతికి విడుదల చేసిన పెండింగ్ DA ఏరియర్స్ వెంటనే క్రెడిట్ చేయాలని, మెమో 57 అమలు చేయాలని, మెమో 178 ప్రకారం మరణించిన ఉద్యోగుల నామినీలకు 50% చెల్లించాలన్నారు.

News February 17, 2026

వెంకీ-కార్తీతో అనిల్ క్రేజీ మల్టీస్టారర్?

image

వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి కలిసి వర్క్ చేయనున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో కీలక పాత్ర కోసం తొలుత ఫహాద్ ఫాజిల్‌ పేరు వినిపించింది. ఇప్పుడు తమిళ స్టార్ కార్తీ పేరు తెరపైకి వచ్చింది. ‘బామ్మర్ది బాలిరెడ్డి’ టైటిల్ ప్రచారంలో ఉంది. జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే, కీర్తి సురేశ్ హీరోయిన్లని టాక్. 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.