News February 26, 2026
అకాల వర్షాలకు 498 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం: జేడీ

ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు 498 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా తెలిపారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. పొట్టదశలో ఉన్న పంట దెబ్బతినడంతో 6 మండలాలు, 31 గ్రామాల పరిధిలోని 330 మంది రైతులు నష్టపోయారని వివరించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News April 13, 2026
KMR: ఎక్కడ లోపం జరిగింది.. ఇంటర్ ఫలితాలపై ఆరా..!

జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా అట్టడుగు స్థానాలకు పడిపోవడంపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫస్ట్ ఇయర్ 49.40% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి, సెకండియర్ లో 63.09% ఫలితాలతో 32వ ర్యాంకుకు జిల్లా పరిమితమైంది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో ఇబ్బందులా… వసతుల్లేవా అనే కారణాలు తెలుసుకుంటున్నారు.
News April 13, 2026
నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.
News April 13, 2026
ఎల్లంపేటలో పెద్దపులి భయం.. గ్రామాల్లో టెన్షన్!

ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మాచారెడ్డి రేంజ్ పరిధిలో అడవి ప్రాంతంలో పులి అడుగుజాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామస్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లకూడదని, పశువులను సురక్షితంగా కాపాడుకోవాలని హెచ్చరించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ వెల్లడించింది.


