News May 27, 2024

అకాల వర్షాలు.. హైదరాబాద్‌లో‌ జాగ్రత్త!

image

హైదరాబాదీలను అకాల‌ వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్‌ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో‌ ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన‌‌ కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేట‌లో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి. SHARE IT

Similar News

News September 30, 2024

HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE

image

మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 30, 2024

HYD: నిరుపేద రోగుల కోసం NIMSలో వెల్ఫేర్ ఫండ్

image

HYD పంజాగుట్ట NIMSలో NIMS పేషెంట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో దీనిని ఆమోదించారు. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, రూ.1 నుంచి రూ.కోటి వరకు విరాళం అందించవచ్చు. ఈ నిధితో తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న నిరుపేదలకు వైద్యం, ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి పార్థీవదేహాలను సొంత ఊర్లకు తరలించనున్నారు.

News September 30, 2024

HYD: పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల KTR సంతాపం

image

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్వరంతో బాధ పడుతూ రాలేకపోయినని Xలో వివరించారు.