News May 27, 2024
అకాల వర్షాలు.. హైదరాబాద్‌లో జాగ్రత్త!

హైదరాబాదీలను అకాల వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేటలో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి.
SHARE IT
Similar News
News November 28, 2025
ట్రాఫిక్ చలాన్లపై నివేదిక ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు నోటీసులు

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని నగరవాసి రాఘవేంద్ర చారి పిటిషన్ దాఖలు చేశారు. తనకి 3 చలాన్లు వేశారని, ట్రాఫిక్ పోలీసులు సొంత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.


