News May 12, 2024

అక్కడ కేంద్ర బలగాలు మోహరించండి: బీజేపీ

image

ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్ బూత్‌లలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, ఆ నియోజకవర్గాలలో వెంటనే కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని బీజేపీ కోరింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషనర్ ముకేశ్ మీనా, డీజీపీ హరీష్ గుప్తాలను ఈ రోజు కలిసిన బీజేపీ నేతలు కిలారి దిలీప్, సాదినేని యామిని శర్మ వారికి వినతి పత్రం అందజేశారు.

Similar News

News February 12, 2025

కృష్ణా: RTC బస్సులో తండేల్ సినిమా.. కొనకళ్ల స్పందన

image

ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. 9వ తేదీన పలాస నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సినిమా ప్రదర్శించినట్లు కంప్లైంట్ వచ్చిందని ఆయన చెప్పారు. అలా ప్రదర్శించడం అనేది తప్పని ఆయన ఖండించారు. దీనిపై ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

News February 12, 2025

బాపులపాడు: అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

News February 12, 2025

కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్‌లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!