News October 13, 2024
అక్కన్నపేట: విద్యుత్ షాక్తో చిన్నారి మృతి
దసరా పండుగ రోజు విద్యుత్ షాక్తో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిఖ కీర్తన్య (8) అనే చిన్నారి దుర్గామాత నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన డీజే కరెంటు తీగ తాకి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసుల కోరడా. @ మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు బదిలీ. @ సిరిసిల్ల జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.
News November 8, 2024
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి కన్నుమూత
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె చనిపోయారు. జ్యోతి దేవి మృతితో మెట్పల్లి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా జ్యోతి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు గతేడాది మృతిచెందారు.
News November 8, 2024
నేడు రాజన్నను దర్శించుకున్న 31,317 మంది భక్తులు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం శుక్రవారం పురస్కరించుకొని 31,317 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.