News April 9, 2025
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. యువకుడికి అధికారుల షాక్

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News October 17, 2025
విభాగాల పనితీరుపై నివేదికలివ్వండి: మంత్రి సత్యకుమార్

AP: వైద్యారోగ్య శాఖలోని 10 విభాగాల పనితీరు మదింపునకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన పంథా అనుసరిస్తున్నారు. ఈ ఏడాది APR-SEP వరకు సాధించిన ఫలితాలు, సమస్యలు, పరిష్కారం, ప్రగతి.. ఇలా 20 అంశాల ప్రాతిపదికన సమీక్షించి పనితీరు సంతృప్తిగా ఉందా లేదా నివేదించాలని అధికారులకు సూచించారు. 14వేల డిస్పెన్సరీలు, ఆసుపత్రుల ద్వారా అందే వైద్యసేవలు, పథకాల అమలు, నాణ్యత తదితరాలపై నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది.
News October 17, 2025
భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బాణసంచా వ్యాపారం నిర్వహించుకోవాలి: సీపీ

భద్రతా ప్రమాణాలను పాటిస్తూ బాణసంచా విక్రయాలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ కమిషనరేట్ పరిధిలోని బాణసంచా విక్రయదారులతో కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, అగ్నిమాపక, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
News October 17, 2025
KNR: SU పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో రేపు(OCT 18) జరగనున్న ఎంఎడ్ 2వ సెమిస్టర్, బీ ఫార్మసీ 2వ సెమిస్టర్, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయనున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బి ఫార్మసీ పరీక్షలు OCT 22న, ఎల్ఎల్ఎం పరీక్ష OCT 29 న జరుగుతాయని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.