News June 26, 2024

అక్కాయపల్లెలో బంగారు ఆభరణాల దోపిడీ

image

కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంటి గేటు తీసి తాళం పగలగొట్టి ఉంది. ఇంటిలోకి వెళ్లి చూసి బీరువాలోని దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News February 16, 2025

ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: కడప ఎస్పీ

image

జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కడపలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు. అంతకుముందు శిక్షణా కేంద్రంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

News February 15, 2025

ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు 

image

ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

News February 15, 2025

కడప: రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

image

మోదీజీ.. ఢిల్లీలో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి కృషి చేయడం లేదని విమర్శించారు.

error: Content is protected !!