News February 17, 2025

అక్కుపల్లి శివ సాగర్ బీచ్‌లో దొరికిన బ్యాగ్ అప్పగింత

image

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర్ బీచ్‌ను ఆదివారం భారీగా పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో మెలియాపుట్టి మండలం తంగణి గ్రామానికి చెందిన సవర త్రివేణి తన సర్టిఫికేట్స్‌లు ఉన్న బ్యాగ్ మార్చిపోయింది. ఈ విషయాన్ని అక్కుపల్లి శ్రీ రామాసేవా సంఘం వారు గుర్తించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది చూసి బాధితురాలికి ఆ బ్యాగ్ అప్పగించారు. అక్కడ ప్రజలు శ్రీ రామా సేవాసంఘం సభ్యులను అభినందించారు.

Similar News

News March 17, 2026

శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.

News March 17, 2026

SKLM: ‘ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలి’

image

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.