News August 3, 2024

అక్టోబరు 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. అడిషనల్ ఈ.ఓ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Similar News

News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

తిరుమల పరకామణిలో దొంగతనం

image

తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

News January 12, 2025

చిత్తూరు: ఇద్దరి కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. అరెస్ట్

image

నిమ్మనపల్లెలో పిల్లలపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు వివరాల మేరకు.. నిమ్మనపల్లెకు చెందిన బోయకొండ (28)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు 9ఏళ్ల ఇద్దరు కుమార్తెలతో బోయకొండ అమానుష ఘటనకు పాల్పడడం భార్య చూసింది. ఆమె ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేయగా శనివారం నిమ్మనపల్లెలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.