News September 29, 2024

అక్టోబర్ 1 నుంచి ఓయూ పీజీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.

Similar News

News November 15, 2025

జూబ్లీహిల్స్ ఎన్నికలో అత్యల్ప ఓట్లు ఎవరికంటే..?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 58 మంది అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. తార్నాకకు చెందిన రాథోడ్ రవీందర్ నాయక్ ఎంఏ ఆంగ్లం పూర్తి చేశాడు. కాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

News November 15, 2025

HYD: NEXT తెలంగాణలో BJP GOVT: బండి సంజయ్

image

జూబ్లీహిల్స్‌లో మైనార్టీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ గెలిచిందని, ఇకపై తాము TGలో హిందువులందరినీ ఏకం చేసి BJP GOVTఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. HYDలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ జరగలేదా కాంగ్రెసోళ్లు చెప్పాలన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో BRS ఓడిందని, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, అది ప్రతిపక్షం ఎలా అవుతుందో KTR చెప్పాలన్నారు.

News November 15, 2025

HYD: నలుగురు మహిళా అభ్యర్థులకు ఎన్ని ఓట్లంటే..?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా BRS అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. బరిలో నిలిచిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు సునీతకు రాగా.. మరో అభ్యర్థి అస్మా బేగంకు 107 ఓట్లు, షేక్ రఫత్ జహాన్‌కు 52, సుభద్రారెడ్డికి 50 ఓట్లు పోలయ్యాయి. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో KCRపై సుభద్రారెడ్డి పోటీ చేయగా గజ్వేల్‌లో 721 ఓట్లు వచ్చాయి.