News October 1, 2024
అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Similar News
News January 11, 2026
ప్రకాశం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటుచేశారు.
News January 11, 2026
వెల్లంపల్లి హైవేపై ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 11, 2026
ప్రకాశం: హైవేపై ప్రమాదం.. ఒకరు దుర్మరణం

లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాచర్ల మండలం ఎడవల్లి గ్రామం వద్ద అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గిద్దలూరు వైద్యశాలకు తరలించగా ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


