News October 1, 2024
అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Similar News
News October 15, 2024
15 పునరావాస కేంద్రాల ఏర్పాటు: ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాలో 5 కోస్టల్ మండలాలు ఉన్నాయని.. వీటి పరిధిలో పూరి గుడిసెలను గుర్తించి 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఇప్పటికే 5 పునరావాస కేంద్రాలను ఓపెన్ చేసి సోమవారం నుంచి ఆ ప్రాంత ప్రజలకు భోజనం అందజేశామని చెప్పారు. ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పడపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొండేపి మండలాల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు.
News October 15, 2024
మాగుంటకు విజయసాయి రెడ్డి విషెస్
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ MP విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఎంపీ మాగుంట అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో TDPలో చేరారు. ఒంగోలు ఎంపీగా విజయాన్ని సైతం అందుకున్నారు. అయితే ఎంపీ మాగుంట పుట్టినరోజు సందర్భంగా విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
News October 15, 2024
ప్రకాశం ఎస్పీకి కీలక బాధ్యతలు
సంచలన కేసులను క్లియర్ చేసిన ఘనత ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు ఉంది. గతంలో ఆయన మన జిల్లాలోనే ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలో సవాల్‌గా మారిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనను ఉండి MLA రఘురామకృష్ణ రాజు(RRR) హత్యాయత్నం కేసు దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ హస్తం ఉందని RRR ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.