News August 30, 2024

అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్ల పట్టివేత

image

చింతూరు మండలం లక్కవరం అటవీ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్లను అటవీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు సుకుమామిడి రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరావు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Similar News

News September 7, 2024

భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసి అర్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News September 7, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

image

వినాయక చవితి పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.

News September 7, 2024

ఖమ్మం: రూ.3.43 కోట్లకు వ్యాపారి ఐపీ

image

ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పురుగుమందుల వ్యాపారి నూతలపాటి రవి స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.3.43 కోట్లకు శుక్రవారం ఐపీ దాఖలు చేశారు. 32 మంది రెండు దాతలను ప్రతివాదులుగా చేర్చారు. కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన పిటిషనర్ పండితాపురంలో పురుగుమందులు, విత్తనాల వ్యాపారం నిర్వహించాడు. వ్యాపార నిమిత్తం తెచ్చిన అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేశారు.