News January 26, 2025

అక్రమ కేసులు పెట్టడం సరికాదు: రాజయ్య

image

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో మాజీ MLA రాజయ్య జనగామ సబ్ జైల్ వద్దకు వెళ్లి అరెస్టుకు గల కారణాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టి కేసిరెడ్డి మనోజ్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టడం సరికాదని మండిపడ్డారు.

Similar News

News November 16, 2025

రాజన్న దర్శనాల నిలిపివేత.. గుడి బయటే మొక్కులు

image

రాజన్న దర్శనం కోసం వచ్చిన వందలాది మంది భక్తులు గుడి ముందు బహిరంగ ప్రదేశంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి భీమన్న ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలామంది భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించుకోకుండా తిరిగి వెళ్ళవద్దనే భావనతో ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టి దండం పెడుతున్నారు. దీంతో ఆలయ ముందు భాగంలో గేటు బయట సందడి నెలకొంది.

News November 16, 2025

ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

image

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.

News November 16, 2025

రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CBN

image

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్‌వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.