News July 6, 2024

అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు టోల్ ఫ్రీ నంబర్లు విడుదల చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే 1800 4256012,08942 293229,97016 91657 నంబర్లకి mgoskimsandcomplaints@myyahoo.com ద్వారా కూడా సమాచారమివ్వాలని కోరారు.

Similar News

News December 7, 2025

విశాఖలో శ్రీకాకుళం మహిళ హత్య

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవిని పెందుర్తి సుజాతనగర్‌లోని ఆమె సహజీవన భాగస్వామి శ్రీనివాస్ కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం జరగగా, హత్య చేసి శ్రీనివాస్ పరారయ్యాడు. నిందితుడు ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 7, 2025

NMMS పరీక్షకు 5516 మంది హాజరు: DEO

image

శ్రీకాకుళం జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజరయ్యారని DEO కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News December 7, 2025

జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

image

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్‌కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఢిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్‌కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.