News January 26, 2025
అక్రమ రవాణాను అడ్డుకున్న గజపతినగరం పోలీసులు

గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో హైవేపై శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 పశువులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు తెలిపారు. రెండు లారీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చిత్ర హింసలకు గురిచేస్తూ పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Similar News
News December 12, 2025
VZM: ‘హెల్త్ కవరేజ్లో ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి’

పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు సీనియర్ సివిల్ జడ్జి & డీఎల్ఎస్ఎ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు కూడా అందరికీ అందిస్తామన్నారు.
News December 12, 2025
24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.
News December 12, 2025
VZM: ’14న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ’

మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తెందన్నారు. దీన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.


