News April 19, 2024

అక్రమ రవాణాపై ఉక్కు పాదం: నెల్లూరు ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీల్లో భాగంగా కావలి వన్ టౌన్ పరిధిలో రూ.4లక్షలు, బాలాజీ నగర్‌లో 2లక్షల 13 వేల నగదుతో పాటు 655 టీ కప్ సెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ పోర్ట్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News September 14, 2024

సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం

image

సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.

News September 14, 2024

నెల్లూరు: రిజిస్ట్రేషన్ శాఖలో ముగ్గురు అధికారులపై వేటు

image

నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన జాఫర్, మిల్కిరోషన్, సింహాద్రిలను సస్పెండ్ చేసినట్లు డీఐజీ కిరణకుమార్ తెలిపారు.

News September 14, 2024

పోలీసుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 36 మంది పోలీసులు వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలు వంటి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.