News June 25, 2024
అక్రమ రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ

ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని సెబ్ అధికారులకు తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సూచించారు. జిల్లా సెబ్ అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు.
Similar News
News December 21, 2025
జగన్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పెద్దిరెడ్డి

YCP అధినేత జగన్ను ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్కు బొకే అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం పెద్దిరెడ్డి గురించి వివరించారు.
News December 21, 2025
TDP చిత్తూరు జిల్లా బాస్ ఎవరంటే..?

TDP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. పుత్తూరుకు చెందిన షణ్ముగ రెడ్డిది వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం. గతంలో జిల్లా అధ్యక్షుడిగా CRరాజన్ పనిచేశారు. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశమిచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు.
News December 21, 2025
చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.


