News June 25, 2024
అక్రమ రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ
ఇసుక, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని సెబ్ అధికారులకు తిరుపతి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సూచించారు. జిల్లా సెబ్ అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచి ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు.
Similar News
News October 8, 2024
బెట్టింగ్‌కు దూరంగా ఉండండి: చిత్తూరు SP
బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోళ్ విజ్ఞప్తి చేశారు. జీడీ నెల్లూరులో బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన స్పందించారు. ‘బెట్టింగ్‌లో రూ.25 లక్షల వరకు పోగొట్టుకోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో బెట్టింగ్ చట్టవ్యతిరేక చర్య. దీని ఊబిలో పడి మోసపోకండి’ అని ఎస్పీ సూచించారు.
News October 8, 2024
ఏర్పేడు: మందు తాగేటప్పుడు తిట్టాడని చంపేశారు
ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద జరిగిన హత్య కేసులో దినేశ్ కుమార్, లోకేశ్ ఇద్దరు ముద్దాయిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రవీణ్ కుటుంబానికి, దినేశ్ కుటుంబానికి మనస్పర్థలు ఉన్నాయని చెప్పారు. మందు సేవించేటప్పుడు ప్రవీణ్ దినేశ్‌ను తిట్టేవాడని, కొట్టేవాడని చెప్పారు. మనస్పర్ధలు కారణంగా ప్రవీణ్‌ను మచ్చు కత్తితో లోకేశ్ సహాయంతో దారుణంగా చంపినట్లు చెప్పారు.
News October 8, 2024
హత్య కేసులో అనిల్ పాత్రే కీలకం..
మదనపల్లె జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమారిని అదే కాలనీలో ఉండే వెంకటేశ్ నమ్మించి నీరుగట్టుపల్లిలోని సాయిరాంవీధికి చెందిన అనిల్ ఇంటికి గతనెల 28న తీసుకొచ్చాడు. అక్కడ మంత్రాలు, తాయత్తుల పేరుతో స్వర్ణకుమారిని అనిల్ పథకం ప్రకారం వెంకటేశ్, అనిల్ ఇద్దరు కలిసి హతమార్చారు. అనంతరం మూటగట్టుకుని గుంత తవ్వి స్వర్ణకుమారిని అందులో పాతిపెట్టారు. అనంతరం విమానాల్లో షికార్లు చేస్తుండగా పట్టుకున్నారు.