News August 20, 2024
అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు: కమీషనర్

రాజంపేట పట్టణ పరిధిలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని, రాజంపేట మున్సిపల్ కమీషనర్ రాంబాబు హెచ్చరించారు. పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1262, 1263, 1264లలో 2.61 విస్తీర్ణంలో వేసిన ప్లాట్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. ఈ ప్లాట్లకు అమ్మకం,కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ జరగదని తెలిపారు. భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వరని వివరించారు. మౌలిక వసతులు కల్పించబోమని అన్నారు.
Similar News
News December 13, 2025
తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
వరంగల్లో బద్వేల్కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.


