News January 7, 2025

అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది: డీఎస్పీ ప్రసాద్

image

కె.గంగవరం (M) కూళ్ళలో జరిగిన యువకుడి హత్య అక్రమ సంబంధం కారణంగా జరిగిందని రామచంద్రపురం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ డీఆర్‌కె‌ఎస్. ప్రసాద్ తెలిపారు. ఆయన మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు, మృతి చెందిన వ్యక్తి మంచి మిత్రులని.. మృతి చెందిన సత్తి సువర్ణ రత్నం తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెంకట సూర్య చంద్ర అనుమానించి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 9, 2025

తూ.గో: అదిరిపోతున్న బస్ ఛార్జీలు..

image

సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు కోనసీమ జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, మండపేట ప్రధాన పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్‌లో సుమారుగా రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

News January 9, 2025

కొత్తపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

కొత్తపేట మండలం పలివెల వంతెన వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చెన్నయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2025

తూ.గో జిల్లా మీదుగా నడిచే 4రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.