News February 13, 2026
అక్రిడేషన్ల కోసం ఎవ్వరికీ నయా పైసా చెల్లించొద్దు: కలెక్టర్

వర్కింగ్ జర్నలిస్టులకు అర్హత ఆధారంగా అక్రిడేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ షామ్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. కార్డుల కోసం ఏ ఒక్కరు ఎవరికీ నయా పైసా చెల్లించాల్సిన పని లేదన్నారు. కార్డులు జారీ అయిన వారి వివరాలు కలెక్టరేట్లో పెట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రిడేషన్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారిపై కేసులు పెడతామని సూచించారు.
Similar News
News March 13, 2026
గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: కలెక్టర్, ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీశ్ స్పష్టం చేశారు. జిల్లాలోని 11 ఏజెన్సీల పరిధిలో 2,12,131 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వారం రోజుల్లోనే 13,985 సిలిండర్లను పంపిణీ చేశామని వివరించారు. సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని వారు కోరారు.
News March 13, 2026
తెనాలిలో రన్నింగ్ బస్సు కిందకి దూసుకెళ్లిన టెన్త్ విద్యార్థి

తెనాలి మారీసుపేటలోని హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి లీలాసాయి మణికంఠ ఒక్కసారిగా బస్సు కిందకి దూసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొత్త వంతెన వద్ద డివైడర్‌పై నడిచి వెళుతున్న అతను అదే సమయంలో నగరం నుంచి తెనాలి వస్తున్న RTC బస్సు కిందకు దూసుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్పృహ కోల్పోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2026
నిర్మల్: ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు

డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ హాకీంపేట ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో పద్మ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 16వ తేదీన నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే పోటీలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు.


