News April 3, 2025
అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్తో మంటలను అదుపు చేశామన్నారు.
Similar News
News April 12, 2025
ప్రకృతి తల్లి ఒడిలో వనజీవి (PHOTO OF THE DAY)

KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
News April 12, 2025
మధిర డిపోను తనిఖీ చేసిన Dy.RM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శనివారం మధిర డిపోను తనిఖీ చేశారు. డిపోలో ఉన్న బస్సుల మెయింటెనెన్స్ విభాగంలో మెకానిక్స్, ఆపరేషన్స్ విభాగంలో డ్రైవర్స్, కండక్టర్లతో మాట్లాడారు. తీవ్ర ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మధిర డిపోలో పనిచేస్తున్న సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DM శంకర్ రావు, ట్రాఫిక్&గ్యారేజ్ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.
News April 12, 2025
REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట బైక్పై రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. ప్రమాదం చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు నిరాకరించడంతోపాటు బదులుగా 100 మొక్కలు నాటాలని అతనికి సూచించారు. రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని క్షమించి మొక్కలు నాటమని కోరడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే రామయ్యకు పర్యావరణం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.