News April 3, 2025

అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి

image

అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం టిడి బంజరలో షార్ట్ సర్క్యూట్ కారణంగా <<15975525>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) మంటలు అంటుకొని సజీవదహనం అయ్యాడని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.

Similar News

News February 23, 2026

BREAKING: మాజీ మంత్రి కన్నుమూత

image

రైల్వే మాజీ మంత్రి, TMC నేత ముకుల్ రాయ్(71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చనిపోయినట్లు కుమారుడు సుభ్రాంశు వెల్లడించారు. ముకుల్ ఒకప్పుడు TMC చీఫ్, సీఎం మమతకు సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో రెండో స్థానంలో పరిగణించేవారు. అయితే 2017లో ఆయన బీజేపీలో చేరారు. 18 ఎంపీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ TMCలో చేరారు.

News February 23, 2026

గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

News February 23, 2026

నాగర్‌కర్నూల్: 3 రోజులు కొట్టుమిట్టాడిన పసి ప్రాణం..!

image

FEB 18- కుమ్మెర జాతరలో దాడి, PSలో బాధితుల ఫిర్యాదు
FEB 21- 3రోజుల తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి మృతి, మళ్లీ PSకు వచ్చిన బాధితులు
FEB 21- పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆరోపణ
FEB 21- వార్త తెలిసి ఆగ్రహించిన ధర్మ సమాజ్ నేతలు NGKLఆస్పత్రి ఎదుట ధర్నా
FEB 21- నిందితులపై కేసు నమోదు చేస్తామని DSP హామీ
FEB 22- బాధితులకు మద్దతిస్తూ BRS, TRP, బీసీ సంఘాల నేతల ధర్నా
FEB 22- ముగ్గురు నిందితుల అరెస్ట్