News February 4, 2025
అగ్ని ప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే

ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆర్డీవోను కోరారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మల్లయ్య, కృష్ణమూర్తి, ఐలయ్యకు చెందిన ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న డా.రాజయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Similar News
News November 27, 2025
KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.
News November 27, 2025
మహబూబాబాద్లో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర నుంచి కేశంపురం వెళ్లేదారి వెడల్పు, సుందరరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు పూర్తయి రోడ్డు మధ్యలో డివైడర్ను కూడా నిర్మించగా, ఇప్పుడు వెడల్పు చేసిన రహదారిని తారు రోడ్డుగా మార్చే పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడినప్పటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


