News February 21, 2025
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వినతి

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులును అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అగ్రి గోల్డ్ ఏజెంట్లు పడుతున్న బాధలు విన్నవించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రెష్, అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
News March 23, 2025
గుత్తిలో కేజీ చికెన్ రూ.170

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.
News March 23, 2025
JNTUలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. సిలబస్‌లో మార్పులు

అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీలోని వీసీ కాన్పరెన్స్ హాల్‌లో శనివారం బోర్డు ఆఫ్ స్టడీస్ (BOS) సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని బీటెక్ 3, 4 సంవత్సరాలకు R23 సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు భానుమూర్తి, సత్యనారాయణ, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.